నకిలీ మద్యంలో జోగి వాటా.. డైరీలో సంచలనాలు
ABN, Publish Date - Nov 23 , 2025 | 01:25 PM
నకిలీ మద్యం తయారీ కేసులో ‘లెక్కలు’ బయటపడుతున్నాయి. ఎవరెవరికి ఎంతెంత ఏ రూపంలో ముట్టిందో వెలుగుచూస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్మోహనరావు కస్టడీలో వెల్లడించిన వివరాలకు సంబంధించిన ఆధారాలను సిట్, ఎక్సైజ్ అధికారులు సేకరించినట్టు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించిన నకిలీ మద్యం తయారీ కేసులో ‘లెక్కలు’ బయటపడుతున్నాయి. ఎవరెవరికి ఎంతెంత ఏ రూపంలో ముట్టిందో వెలుగుచూస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్మోహనరావు కస్టడీలో వెల్లడించిన వివరాలకు సంబంధించిన ఆధారాలను సిట్, ఎక్సైజ్ అధికారులు సేకరించినట్టు తెలిసింది. నకిలీ మద్యం తయారు చేయడానికి ఉపయోగించిన ఫార్ములాకు చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ, అతడి కుమారుడు సుదర్శన్‌కు రూ.2.50 కోట్లకు పైగా డబ్బులు అందినట్టు తేలింది. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కట్టా రాజు రాసుకున్న డైరీ ద్వారా ఈ లెక్కలు బయటికి వచ్చినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి...
ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated at - Nov 23 , 2025 | 01:25 PM