Desk Jobs: కదలకుండా వర్క్ చేస్తున్నారా.. అయితే మీ ప్రాణాలకు ముప్పే..
ABN, Publish Date - Nov 30 , 2025 | 09:24 PM
ఇటీవలి కాలంలో లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. బీపీ, షుగర్ నుంచి గుండె జబ్బుల వరకూ చిన్న వయసులోనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం డెస్క్ జాబ్సే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి..
ఒకేచోట కదలకుండా చేసే ఉద్యోగాల్లో అంత ముప్పు ఉందా.. బీపీ, షుగర్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం అవేనా.. వ్యాయామం చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుందా.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలా.. ఈ సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. బీపీ, షుగర్ నుంచి గుండె జబ్బుల వరకూ చిన్న వయసులోనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం డెస్క్ జాబ్సే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి. గంటల తరబడి కూర్చుని ఉండే అలవాటుతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. డెస్క్ ఉద్యోగాలు.. కదలకుండా కూర్చునే పని చేసే సిబ్బందికి ఇదొక హెచ్చరిక లాంటిదని అంటున్నారు. సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి రోజువారీ ఆహారమే కారణమని చాలా మంది భావిస్తుంటారు. కానీ మనకు ఉన్న చిన్న చిన్న అలవాట్లో ఈ ముప్పుకు దారి తీస్తున్నాయి. మనకు తెలీకుండానే మన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుకుంటున్నాం.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Nov 30 , 2025 | 09:33 PM