హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ బోర్డుకు పాలాభిషేకం
ABN, Publish Date - Dec 18 , 2025 | 06:02 PM
అధిక వడ్డీలు ఆశ చూపి సీనియర్ సిటిజన్లను మోసం చేసిన ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ బాధితులు హైదారాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ బోర్డుకు పాలాభిషేకం చేశారు. ఈ ట్రస్ట్ సుమారు 4 వేల మంది నుంచి సుమారు రూ.516 కోట్లు డిపాజిట్ చేయించుకుని మోసం చేసింది. ఈ బాధితుల తరఫున సీసీఎస్ పోలీసులు నిలబడి పోరాడారు.
హైదరాబాద్, డిసెంబర్ 18: అధిక వడ్డీలు ఆశ చూపి సీనియర్ సిటిజన్లను మోసం చేసిన ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ బాధితులు హైదారాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ బోర్డుకు పాలాభిషేకం చేశారు. ఈ ట్రస్ట్ సుమారు 4 వేల మంది నుంచి సుమారు రూ.516 కోట్లు డిపాజిట్ చేయించుకుని మోసం చేసింది. ఈ బాధితుల తరఫున సీసీఎస్ పోలీసులు నిలబడి పోరాడారు. దీనిపై హైకోర్టులో విచారణలు జరిగాయి. చివరకు బాధితుల పక్షాన హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ధన్వంతరీ సంస్థ ఆస్తులను జప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కారణంగానే, వారు తమకు అండగా నిలవడంతోనే న్యాయం జరిగిందని బాధితులు తెలిపారు. సీసీఎస్ పోలీసులకు కృతజ్ఞతగా పోలీస్ స్టేషన్ కు పాలాభిషేకం చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల కోసంపై వీడియోను వీక్షించండి.
Also Read:
విద్యార్థుల మృతి కేసులో నకిలీ పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజాదర్బార్‌లో మంత్రి కొండపల్లి
Updated at - Dec 18 , 2025 | 06:02 PM