Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఇక భారీ వర్షాలు

ABN, Publish Date - Oct 02 , 2025 | 11:52 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 360, గోపాల్‌పూర్‌కు 360 కిటోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా, పూరీకి 390 కిలోమీటర్ల దక్షిణంగా కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి, గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 360, గోపాల్‌పూర్‌కు 360 కిటోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా, పూరీకి 390 కిలోమీటర్ల దక్షిణంగా కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి, గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడి గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున పూరీ సమీపంలో తీరగోపాల్‌పూర్, ప్యారాపూర్ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో బుధవారం కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. గురువారం ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓడ రేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Oct 02 , 2025 | 11:52 AM