ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు
ABN, Publish Date - Feb 05 , 2025 | 09:31 PM
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ బుధవారం పార్టీకి చెందిన తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ బుధవారం పార్టీకి చెందిన తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కుల గణన సర్వేను తప్పుబడుతూ అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేయడం, కుల గణన ఫామ్‌ను దగ్ధం చేయడంపై వివరణ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
Updated at - Feb 05 , 2025 | 09:31 PM