SLBC టన్నెల్‌లో ఆనవాళ్లను గుర్తించిన జాగిలాలు
ABN, Publish Date - Mar 09 , 2025 | 11:15 AM
SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతు అయిన కార్మికులను గుర్తించడంలో పురోగతి కనిపిస్తోంది. స్నిపర్ డాగ్స్ కార్ఆమికుల నవాళ్లను గుర్తించాయి.
నాగర్ కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతు అయిన కార్మికులను గుర్తించడంలో పురోగతి కనిపిస్తోంది. స్నిపర్ డాగ్స్ కార్మికుల ఆనవాళ్లను గుర్తించాయి. జీపీఆర్ అలాగే డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో రెస్క్యూ టీమ్ తవ్వుతున్నారు.
టీబీఎంకు ఎడమ పక్కన ఓ కార్మికుడి మృతిదేహానికి సంబంధించిన చేతిని గుర్తించారు. పూర్తిగా కాంక్రీట్‌లో కార్మికుడి మృతదేహం కూరుకుపోయింది. ఇక డ్రిల్లింగ్ ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లంతయిన వారిలో కొందరిని ఈరోజు సాయంత్రం లోగా గుర్తించే అవకాశాలు ఉన్నాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 10 , 2025 | 10:25 AM