నా ఫోటో ఏది.. బీజేపీ నేత ఫైర్
ABN, Publish Date - Feb 21 , 2025 | 03:48 PM
BJP: బీజేపీ నేతల సమావేశంలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. తన ఫోటోను ఫ్లెక్సీలో ఎందుకు వేయలేదంటూ పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నేత శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా, ఫిబ్రవరి 21: పెద్దపల్లిలోలో బీజేపీ నేతల (BJP Leaders) సమావేశంలో వివాదం చెలరేగింది. సమావేశంలో ఫెక్ల్సీల (Flexy Issue) రగడ చోటు చేసుకుంది. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం ప్రారంభంకాకముందే ఫ్లెక్సీలో తన ఫోటో లేదంటూ బీజేపీ నేత శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశానని, అయినా తన ఫోటోను ఫ్లెక్సీలో పెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. దళిత బిడ్డను అవమానించారంటూ మరో బీజేపీ నేత సంజీవ్ రెడ్డితో శ్రీనివాస్ వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీనివాస్‌కు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు సంజీవ్ రెడ్డి.
ఇవి కూడా చదవండి...
2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్
Read Latest Telangana News And Telugu News
Updated at - Feb 21 , 2025 | 03:48 PM