Cyber Crime: ఏపీ మంత్రి అల్లుడిపై సైబర్ వల..

ABN, Publish Date - Aug 23 , 2025 | 01:08 PM

ఏపీ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునిత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.కోటి 96 లక్షలను సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఏపీ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునిత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.కోటి 96 లక్షలను సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పునిత్ నిర్వహించే ఐవీ గ్రీన్ ఇన్‌ఫ్రా కంపెనీ అకౌంటెంట్‌కు వాట్సాప్ మెసేజ్ రావడంతో .. పునిత్ నుంచే ఆ మెసేజ్ వచ్చిందని భావించిన అకౌంటెంట్.. సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంక్ అకౌంట్‌కు నగదును ట్రాన్ఫర్ చేశారు. దీనిపై నెల్లూరు రూరల్ పోలీసులు విచారణ చేపట్టి, వెంటనే పునిత్ అకౌంట్ నుంచి రూ.కోటి 40 లక్షలను సీజ్ చేశారు.

Updated at - Aug 23 , 2025 | 01:08 PM