ఒక్క డైరీ తో 27 మంది మావోయిస్టులు అరెస్ట్..!

ABN, Publish Date - Nov 18 , 2025 | 02:30 PM

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు.

విజయవాడ: నగరంలో మావోయిస్టుల కలకలం రేగింది. నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. అరెస్టయిన మావోయిస్టుల్లో నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో దొరికిన డెయిరీలో వీరి సమాచారం ఉంది. ఒక మహిళ ఆధ్వర్యంలో షెల్టర్ నిర్వహణ జరుగుతుంది. స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్‌, గ్రేహండ్స్‌ బలగాలు కొత్త ఆటోనగర్‌ను ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేశారు. భవన యజమాని కోసం పోలీసుల ఆరా తీశారు. అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు సమాచారం. కూలీ పనుల కోసం వచ్చామంటూ, అద్దెకు ఉంటామని మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.



Also Read:

విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్

తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి..

For More Latest News

Updated at - Nov 18 , 2025 | 02:30 PM