Gagan Chandra: మేధాశక్తి ఎవరి సొత్తు కాదు.. నిరూపించిన 14 ఏండ్ల కుర్రాడు
ABN, Publish Date - Feb 10 , 2025 | 03:12 PM
కలలను కనడమే కాదు. తాను కన్న ఆ కలలను చిన్న వయస్సులో 14 ఏళ్ల విద్యార్థి సాకారం చేశాడు. మేధాశక్తి ఎవరి సొత్తు కాదని గగన్ చంద్ర నిరూపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల తోడ్పాటుతో తన పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకువచ్చాడు.
కలలను కనడమే కాదు. తాను కన్న ఆ కలలను చిన్న వయస్సులో 14 ఏళ్ల విద్యార్థి సాకారం చేశాడు. మేధాశక్తి ఎవరి సొత్తు కాదని గగన్ చంద్ర నిరూపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల తోడ్పాటుతో తన పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకువచ్చాడు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రానికి చెందిన గగన్ చంద్ర ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచే ఇంట్లో పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులతో చిన్న చిన్న ఆవిష్కరణలు చేసేవాడు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో గగన్ చంద్ర మరింత ముందుకెళ్లాడు. జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో గుర్తింపు సంతోషంగా ఉందని గగన్ చంద్ర తెలిపారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 10 , 2025 | 03:17 PM