Attack On Woman: తెలంగాణలో మహిళపై అత్యాచారం.. వివస్త్రను చేసి, స్తంభానికి కట్టేసి..
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:07 PM
మెదక్ జిల్లా జానకంపల్లి పంచాయతీ సమీపంలోని ఒక తండా నుంచి కూలీ పని కోసం ఓ మహిళ మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చింది. కూలీ పని ఉందని నమ్మించిన దుండగులు.. కోల్పారం మండలం అప్పాజిపల్లి శివారు ఏడుపాయల రోడ్డు వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే పనికి ఒడికట్టారు కొందరు దుర్మార్గులు. కూలి పని ఇప్పిస్తామని తీసుకెళ్లి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయేందుకు కారణం అయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
మెదక్ జిల్లా జానకంపల్లి పంచాయతీ సమీపంలోని ఒక తండా నుంచి కూలీ పని కోసం సదరు మహిళ మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చింది. కూలీ పని ఉందని నమ్మించిన దుండగులు.. కోల్పారం మండలం అప్పాజిపల్లి శివారు ఏడుపాయల రోడ్డు వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం చేసి, విచక్షణారహితంగా కొట్టి, వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి వెళ్లిపోయారు. రాత్రంతా నగ్నంగా స్తంభానికి కట్టి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళను మెదక్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంకా చదవండి:
Women Ministers Vs ponguleti: వరంగల్ పంచాయితీలో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీకి చేరిన వివాదం..
SHOCKING: పెళ్లయిన 13 రోజులకే గర్భం దాల్చిన యువతి