Share News

Drug Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.13.3కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:07 AM

బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మహిళ గంజాయి తీసుకొస్తుండగా.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌) అధికారులు పట్టుకున్నారు.

Drug Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.13.3కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

  • బ్యాంకాక్‌ నుంచి తీసుకొస్తుండగా పట్టుకున్న డీఆర్‌ఐ

శంషాబాద్‌ రూరల్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మహిళ గంజాయి తీసుకొస్తుండగా.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌) అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపుగా రూ.13.3 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన గుల్ఫాసాభాను అనే ప్రయాణికురాలు మంగళవారం తెల్లవారుజామున 6ఈ1088 ఇండిగో విమానంలో బ్యాంకాక్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, ముందస్తు సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ఆమె బ్యాగులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 13.3 కేజీల హైడ్రోపోనిక్‌ గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.


క్యాబ్‌ పికప్‌ పాయింట్‌ తిరిగి సీ పాయింట్‌కు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాబ్‌ పికప్‌ పాయింట్‌ను తిరిగి సీ పాయింట్‌కు మార్చారు. గతంలో క్యాబ్‌ పికప్‌ పాయింట్‌ను హెచ్‌ పాయింట్‌కు మార్చడంతో తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నిరసన వ్యక్తం చేసింది. ఈ నిరసనల కారణంగా విమానాశ్రయ నిర్వహణ అధికారులు పికప్‌ పాయింట్‌ను తిరిగి సీ పాయింట్‌కు మార్చాలని నిర్ణయించారు. ఈ మార్పు వల్ల ప్రయాణికులకు, క్యాబ్‌ డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల క్యాబ్‌ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 04:07 AM