Crime News: వరంగల్: బట్టుపల్లి రోడ్డులో దారుణం
ABN , Publish Date - Feb 21 , 2025 | 07:46 AM
కొంత మంది గుర్తు తెలియని దుండగులు రోడ్డుపై వెళుతున్న ఓ కారును అడ్డుకొని, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని కిందికి దించి ఇనుప రాడ్లతో అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
వరంగల్: బట్టుపల్లి రోడ్డు (Battupalli Road )లో దారుణం (Incident) జరిగింది. నడిరోడ్డుపై వెళుతున్న కారు (Car)ను కొంతమంది దుండగులు (Assault) ఆపి.. కారులో ఉన్న వ్యక్తి పై ఇనుప రాడ్లతో దాడి (Attack)చేశారు. ముగ్గురు వ్యక్తులు కారుకు అడ్డు వచ్చి.. కారులో ఉన్న వ్యక్తిని కిందికి దింపి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దాడికి గురైన వ్యతి సుమంత్ రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్త కూడా చదవండి..
ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..
కాగా కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న సుమంత్ రెడ్డిని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అయితే దాడికి పాల్పడిన వారు ఎవరు... ఎందుకు అతనిని చంపాలని అనుకున్నారనే విషయాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు విచారణ చేసిన తర్వాత ఈ ఘటనపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా వరంగల్ నగరం ఉలిక్కిపడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా..
సజ్జల భూములపై ప్రారంభమైన సర్వే
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News