Share News

Hospital Fake Reports: వెలుగు చూస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల మోసాలు.. ఫేక్ రిపోర్టులతో

ABN , Publish Date - Jan 27 , 2025 | 08:31 AM

వరంగల్: నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న కల్యాణి ఆస్పత్రి ఘటన మరువకముందే నేడు మరో దారుణం బయటపడింది. ఏకశిలా ఆస్పత్రి యాజమాన్యం తన మెడికల్ రిపోర్టులు మార్చారంటూ హనుమకొండ జిల్లా వంగపహాడ్‌కు చెందిన ప్రశాంత్ ఆందోళనకు దిగాడు.

Hospital Fake Reports: వెలుగు చూస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల మోసాలు.. ఫేక్ రిపోర్టులతో
Warangal

వరంగల్: నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల(Private Hospitals) దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న కల్యాణి ఆస్పత్రి (Kalyani Hospital) ఘటన మరువకముందే నేడు మరో దారుణం బయటపడింది. ఏకశిలా ఆస్పత్రి (Ekashila Hospital) యాజమాన్యం తన మెడికల్ రిపోర్టులు (Medical Reports) మార్చారంటూ హనుమకొండ జిల్లా వంగపహాడ్‌కు చెందిన ప్రశాంత్ ఆందోళనకు దిగాడు. హత్యాయత్నం కేసులో తాను గాయపడి చికిత్స తీసుకున్నానని, కానీ ఏకశిలా ఆస్పత్రి యాజమాన్యం మాత్రం రిపోర్టులు మార్చి నిందితులు తప్పించుకునేలా చేశారని ఆరోపించాడు.

Hyderabad: కొత్త అవతారమెత్తిన సాఫ్ట్‌వేర్లు.. వీరు చేసిన పనికి పోలీసులు ఏం చేశారంటే..


తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో మొదట దాడి కేసుగా కేషీట్‌లో నమోదు చేశారని, తర్వాత నిందితులతో వారు చేతులు కలిపి కేషీట్‌లో మార్పులు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను రోడ్డుప్రమాదంలో గాయపడినట్లు రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసుగా కోర్టుకు తప్పుడు నివేదిక సమర్పించారని మండిపడ్డాడు. దీంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకున్నారంటూ ఆస్పత్రి ఎదుటే ప్రశాంత్ ఆందోళనకు దిగాడు. అనంతరం పోలీసులు, డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని ఉన్నతాధికారులను బాధితుడు ప్రశాంత్ కోరాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gold and Silver Rates Today: ఈరోజు బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Minister Tummala: రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు: మంత్రి తుమ్మల

Updated Date - Jan 27 , 2025 | 08:38 AM