Share News

Hyderabad: కొత్త అవతారమెత్తిన సాఫ్ట్‌వేర్లు.. వీరు చేసిన పనికి పోలీసులు ఏం చేశారంటే..

ABN , Publish Date - Jan 27 , 2025 | 07:54 AM

హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి మంచిస్థాయిలో ఉన్నవారు సైతం నేరాల బాట పడుతున్నారు. విలాసవంతమైన జీవితం, ఈజీ మనీకి అలవాటు పడి తప్పులు చేస్తున్నారు. కన్నవారికి తలవంపులు తెస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు తాము అలవాటు పండిందే కాక, ఇతరను సైతం ఆ బురదలోకి లాగుతున్నారు.

Hyderabad: కొత్త అవతారమెత్తిన సాఫ్ట్‌వేర్లు.. వీరు చేసిన పనికి పోలీసులు ఏం చేశారంటే..
Hyderabad

హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి మంచిస్థాయిలో ఉన్నవారు సైతం నేరాల బాట పడుతున్నారు. విలాసవంతమైన జీవితం, ఈజీ మనీకి అలవాటు పడి తప్పులు చేస్తున్నారు. కన్నవారికి తలవంపులు తెస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు తాము అలవాటు పండిందే కాక, ఇతరులను సైతం ఆ బురదలోకి లాగుతున్నారు. తమ కోరికలు తీర్చుకునేందుకు డ్రగ్స్ సరఫరా చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో శివరామ్, అజయ్ అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు.


వీరిద్దరూ విదేశీ గంజాయి దందా మెుదలుపెట్టారు. అమెరికా నుంచి ఖరీదైన గంజాయి తీసుకువచ్చి తోటి ఉద్యోగులతోపాటు గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో విక్రయాలు చేస్తున్నారు. విషయం కాస్త తెలంగాణ ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులకు చేరడంతో పక్కా పథకం ప్రకారం శివరామ్‌ను పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 170 గ్రాముల విదేశీ గంజాయి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మరో నిందితుడు అజయ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల సరఫరాదారులపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

Gold and Silver Rates Today: ఈరోజు బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Minister Tummala: రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు: మంత్రి తుమ్మల

Updated Date - Jan 27 , 2025 | 07:55 AM