Share News

Jayashankar Bhupalpally: రహస్యంగా బాలికల హాస్టల్లోకి చొరబడ్డ ఆగంతకుడు.. చివరకు ఏమైందంటే

ABN , Publish Date - Dec 29 , 2025 | 04:21 PM

బాలికల హాస్టల్‌లో ఓ ఆగంతకుడు హల్‌చల్‌ చేశాడు. హాస్టల్‌లోకి చొరబడ్డ ఆ వ్యక్తి.. అతడి స్నేహితులను కూడా అక్కడకు పిలిపించుకున్నాడు. దీంతో బాలికలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Jayashankar Bhupalpally: రహస్యంగా బాలికల హాస్టల్లోకి చొరబడ్డ ఆగంతకుడు.. చివరకు ఏమైందంటే
Jayashankar Bhupalpally

జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 29: జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్ట్‌ల్లోకి ఓ ఆగంతకుడు చొరబడటం తీవ్ర కలకలం రేపుతోంది. అతడితో పాటు వారి స్నేహితులను కూడా సదరు ఆగంతుకుడు పిలిపించడంతో విద్యార్థినిలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై అప్రమత్తమైన బాలికలు వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. అయితే హాస్టల్‌కు ఎవరో వ్యక్తి రావడంపై అప్రమత్తమవ్వాల్సిన వార్డెన్.. తిరిగి బాలికలనే తిట్టడం చర్చనీయాంశంగా మారింది.


బాలికల హాస్టల్లోకి ఆగంతకుడు, అతడి స్నేహితులు చొరబడినప్పటికీ బాలికలు ఎంతో ధైర్యంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను తీసుకెళ్లారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఈ వ్యవహారాన్ని రహస్యంగా సెటిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో విద్యార్థినిలకు అండగా నిలవాల్సిన వార్డెన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.


అసలు విషయాన్ని దాచిపెట్టి బాలికలను బూతులు తిట్టడమే కాకుండా, విచక్షణారహితంగా కొట్టిందని, పలువురు విద్యార్థినిలు గాయపడ్డారని తెలుస్తోంది. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు.. హాస్టల్ వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి ఎస్సీ బాలికల హాస్టల్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 29 , 2025 | 04:53 PM