Share News

Greyhounds jawans: మందుపాతర పేలి ముగ్గురు జవాన్ల మృతి

ABN , Publish Date - May 08 , 2025 | 10:02 AM

Greyhounds jawans: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Greyhounds jawans: మందుపాతర పేలి  ముగ్గురు జవాన్ల మృతి
Greyhounds jawans

ములుగు: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జవాన్లు కూంబింగ్ చేస్తుండగా మావోలు అమర్చిన మదుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాద ఘటన ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో గల వీరభద్రవరం తడపాల గుట్టలపై జరిగింది. అయితే ఈఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లాలో ఇవాళ (గురువారం) ఉదయం గ్రేహౌండ్స్ జవాన్లు కూంబింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. దీంతో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతిచెందారు. వీరు తెలంగాణ గ్రేహౌండ్స్‌కు చెందిన పోలీసులుగా తెలుస్తోంది. ఈ ఘటనను ములుగు ఎస్పీ ఇంకా ధ్రువీకరించలేదు. నిన్న కూంబింగ్‌కు పోలీసు బలగాలు వెళ్లాయి. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున మందుపాతర పేలుడు సంభవించడంతో ఈ ఘటన జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఆపరేషన్ కగార్‌తో తమకు సంబంధం లేదని వరంగల్ మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. మందుపాతర పేలిన విషయం తెలియడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ ఘటనతో మరోసారి మావోలు తమ ఉనికిని చాటుకున్నారు.


కాగా.. తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పోలీసు బలగాలు భారీగా పాల్గొంటున్నాయి. దీంతో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. మావోల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల మావోలకు, పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇటు పోలీసులు, పలువురు మావోలు మృతిచెందారు.


కేంద్రం చేపట్టిన చర్యలను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శాంతికమిటీతో చర్చలు కూడా జరిపారు. కేంద్రప్రభుత్వం మరోసారి ఆపరేషన్ కగార్‌పై ఆలోచించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని పౌర హక్కుల సంఘాల నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. కేంద్రం ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘాల నేతలు కోరారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని పౌర హక్కుల సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలో మావోలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచిచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Special Trains: నల్గొండ, విజయవాడ, ఏలూరు మీదుగా బెర్హంపూర్‌ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు

Kishan Reddy: ఆపరేషన్‌ సిందూర్‌ భారత నిబద్దతకు నిదర్శనం

CM Revanth Reddy: మరీ ఇంత నిర్లక్ష్యమా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2025 | 10:37 AM