Share News

Minister: త్వరలో విద్యాలయాల ఆకస్మిక తనిఖీ: మంత్రి పొన్నం

ABN , Publish Date - Jan 30 , 2025 | 08:36 AM

రానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అధ్యాపకులు, ఉపాధ్యాయులకు సూచించారు.

Minister: త్వరలో విద్యాలయాల ఆకస్మిక తనిఖీ: మంత్రి పొన్నం

హైదరాబాద్: రానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అధ్యాపకులు, ఉపాధ్యాయులకు సూచించారు. బంజారాహిల్స్‌(Banjara Hills)లోని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో బుధవారం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలపై జిల్లాకు చెందిన అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల సమయంలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యాచరణ రూపొందించుకుని వందశాతం ఉత్తీర్ణతను నమోదు చేసేందుకు పాటుపడాలని ఆదేశించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గుండెపోటుతో యువ కానిస్టేబుల్‌ మృతి


వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషిచేసిన ఉపాధ్యాయులను ఆగస్టు 15న సన్మానిస్తామన్నారు. త్వరలో పాఠశాలలు, కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. వచ్చే జూన్‌లో విద్యాపరమైన అంశాలపై సమావేశం ఏర్పాటు చేయాలని డీఈఓను మంత్రి ఆదేశించారు. అనంతరం గతేడాది పదోతరగతి, ఇంటర్‌ ఫలితాలపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durisetty), డీఆర్‌ఓ వెంకటాచారి, డీఈఓ రోహిణి, డీఐఈఓ వడ్డెన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ అధికారులు కోటాజీ, ఆశన్న, ఇలియాస్‌ అహ్మద్‌, కాలేజీ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..

ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ వాసి మృతి

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..

ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 30 , 2025 | 08:36 AM