Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
ABN , Publish Date - Dec 13 , 2025 | 09:06 PM
ఇటీవల కాలంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నియమాలు అమలు చేస్తున్నా.. ఈ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట హైవేపై వెళ్తున్న బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. చనిపోయిన వారి వివరాలు.. కూర్మ లింగయ్య (45), సాయవ్వ(40), సాయిలు (18), మానస(8). మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రేపు (ఆదివారం) జరగబోయే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి తమ స్వగ్రానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. గతంలో కూడా పెద్దశంకరంపేటలో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
లియోనల్ మెస్సికి సారీ చెప్పిన సీఎం మమతా బెనర్జీ
మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!