Komatireddy: సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉంటుంది
ABN , Publish Date - Jan 28 , 2025 | 10:05 AM
తెలుగు సినీ ఇండస్ర్టీకి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Cinematography Minister Komatireddy Venkat Reddy) అన్నారు.
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ర్టీకి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Cinematography Minister Komatireddy Venkat Reddy) అన్నారు. సోమవారం డబ్బింగ్ థియేటర్ నిర్వాహకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినీ కళాకారులు, కార్మికుల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తున్నామని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన వద్దకు వచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బైక్ ఢీకొట్టి.. బస్సు దూసుకెళ్లి..

దేశంలోనే తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, వాటిని మరింతమెరుగుప్చుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా ఇండస్ర్టీని మరింత విస్తరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే వాటి వివరాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర, సినీ నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..
ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ
ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News