Hyderabad: బైక్ ఢీకొట్టి.. బస్సు దూసుకెళ్లి..
ABN , Publish Date - Jan 28 , 2025 | 09:16 AM
రాంగ్‌రూట్‌లో వచ్చిన బైక్ రైడర్ పాదచారిని ఢీ కొట్టడంతో అతను రోడ్డుమీద పడిపోయాడు. అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాదకర ఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్(Chaitanyapuri Police Station) పరిధిలో చోటు చేసుకుంది.
- రాంగ్రూట్లో వచ్చి పాదచారి ఉసురుతీసిన వ్యక్తి
హైదరాబాద్: రాంగ్‌రూట్‌లో వచ్చిన బైక్ రైడర్ పాదచారిని ఢీ కొట్టడంతో అతను రోడ్డుమీద పడిపోయాడు. అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాదకర ఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్(Chaitanyapuri Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్‌హౌస్ సమీపంలో ఓ పాదచారుడు రోడ్డును దాటుతున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మరిన్ని డబ్బులు అడిగినందుకే చంపేశాడు..
ఈ క్రమంలో రాంగ్‌రూట్లో స్కూటీపై (టీఎ్‌స11ఇజీ7628) వేగంగా వచ్చిన వ్యక్తి అతడిని ఢీకొట్టాడు. దాంతో అతను రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో ఎల్‌బీనగర్(LB Nagar) వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి వెళ్లింది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు చేశారు. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..
ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ
ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News