Share News

LRS Scheme: ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుములో 10% రాయితీ?

ABN , Publish Date - Feb 15 , 2025 | 03:55 AM

రాష్ట్రంలో ‘లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)’ కింద 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది. అయినా దరఖాస్తుల పరిష్కారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.

LRS Scheme:  ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుములో 10% రాయితీ?

  • పురపాలక శాఖ అధికారుల ప్రతిపాదనలు

  • మందకొడిగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం

  • వచ్చినవి 25.70 లక్షలు.. పరిశీలించినవి 9 లక్షలు

  • క్రమబద్ధీకరణకు అనుమతించినవి 1.70 లక్షలే!

  • గత ఆగస్టులో ప్రభుత్వ ప్రకటన.. ప్రజల అనాసక్తి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)’ కింద 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది. అయినా దరఖాస్తుల పరిష్కారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ ప్రక్రియలో పలు లోపాలను గుర్తించిన అధికారులు.. రాబోయే మూడు నెలల్లో వీలైనన్ని ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 10 శాతం రాయితీ ఇవ్వాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీనిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలో ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుములో 25 శాతం రాయితీ ఇచ్చే అంశం అసలు చర్చకు రాలేదన్నారు. పురపాలక శాఖ నుంచి కేవలం 10ు రిబేట్‌ ఇవ్వాలని మాత్రమే ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25.70 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 9 లక్షలే పరిష్కరించారు. వాటిలోనూ క్రమబద్ధీకరణకు అనుమతించినవి కేవలం 1,70,000 మాత్రమే. వీటి ద్వారా ఇప్పటి వరకూ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.120 కోట్లు. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3, ఎల్‌4 దశల్లో దరఖాస్తుల పరిశీలనకు తొలుత మార్గదర్శకాలు ఇచ్చి, తర్వాత సవరించారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో మరింత జాప్యమవుతుండడంతో మార్పులు చేశారు. ప్రస్తుతం ఎల్‌1 దశలో పరిశీలించిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా ఉంటే క్రమబద్ధీకరణకు ఆమోదం తెలుపుతున్నారు. అలాగే నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం సంయుక్త విచారణ చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని సడలింపులు చేశారు. జలవనరులకు 200 మీటర్ల దూరంలో ఉండే సర్వే నంబర్లు, ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉండే సర్వే నంబర్ల విషయంలో మాత్రమే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల అభిప్రాయాలను తీసుకునేలా మార్పులు చేశారు.


పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణం

రాష్ట్రంలో మునిసిపాలిటీల పరిధిలో 14,38,440 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు పరిశీలించిన దరఖాస్తులు కేవలం 3,74,825 మాత్రమే. మునిసిపాలిటీల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఆదాయం రూ.106.53 కోట్లు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మునిసిపాలిటీ పరిధిలో 3788 దరఖాస్తులు వస్తే ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఒక్క రూపాయి రాలేదు. వరంగల్‌ గ్రామీణ పరిధిలో ఉన్న వర్ధన్నపేటలోనూ ఇదే పరిస్థితి. అక్కడ 522 దరఖాస్తులు వస్తే నేటికీ రూపాయి వసూలు కాలేదు. ఇలా పలు చోట్ల దరఖాస్తులు వచ్చినా.. రూపాయి కూడా వసూలు కాలేదు. పట్టణ పరిధిలో వచ్చిన దరఖాస్తుల్లో 1,44,925 మందికి ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించాలని సమాచారం పంపితే 14206 మంది మాత్రమే కట్టేందుకు ముందుకు వచ్చారు.


క్రమబద్ధీకరణ రుసుములు ఇలా..

2020 సెప్టెంబరు 16న ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి సంబంధించి అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుములపై ప్రభుత్వం జీవో 135 జారీ చేసింది. తొలుత 131 జీవోను 2020 ఆగస్టు 31న ఇచ్చింది. ఇందులో టేబుల్‌1లో ఎల్‌ఆర్‌ఎస్‌ కనీస క్రమబద్ధీకరణ రుసుము ఎంత వసూలు చేయాలో నిర్ణయించింది. తర్వాత 135 జీవోలో మార్కెట్‌ విలువ మీద ఉన్న క్రమబద్ధీకరణ రుసుముల శాతాన్ని సవరిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇది ఆయా ప్రాంతాల్లో ఉండే మార్కెట్‌ విలువలు, భూ విస్తీర్ణం ఆధారంగా మారుతుంది. గజం రూ.3-5 వేల వరకు ఉంటే 30 శాతం, రూ.5-10 వేల మధ్య ఉంటే 40 శాతం, రూ.10-20 వేల మధ్య ఉంటే 50 శాతం, రూ.20-30 వేల మధ్య ఉంటే 60 శాతం, రూ.30-50 వేల మధ్య ఉంటే 80 శాతం, రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే 100 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేని లేఅవుట్‌లో 10 శాతం ఖాళీ స్థలం లేకపోయినప్పటికీ. నేరుగా భవనాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుముతోపాటు 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ చార్జీ, అదనంగా 33ు కాంపౌండ్‌ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకుంటే ఈ 33ు అదనపు రుసుము పడదని అధికారులు చెబుతున్నారు. జీవో నంబరు 131లో 100 చదరపు మీటర్ల విస్తీర్ణానికి చదరపు మీటరుకు రూ.200 కనీస క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాలి. ఆ తర్వాత చదరపు మీటరును బట్టి రుసుము మారుతుంటుంది. డీటీసీపీ దేవేందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుముల్లో 10ు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించకుండా నేరుగా బిల్డింగ్‌ అనుమతులు కోరితే ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలతోపాటు 33ు అదనంగా కాంపౌండ్‌ ఫీజు విధిస్తామని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వెళితే ఈ చార్జీలు కట్టాల్సిన అవసరం ఉండదని చెప్పారు. దరఖాస్తులను పరిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 10 శాతం రాయితీ ఇవ్వాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీనిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలో ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుములో 25 శాతం రాయితీ ఇచ్చే అంశం అసలు చర్చకు రాలేదన్నారు. పురపాలక శాఖ నుంచి కేవలం 10ు రిబేట్‌ ఇవ్వాలని మాత్రమే ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25.70 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 9 లక్షలే పరిష్కరించారు. వాటిలోనూ క్రమబద్ధీకరణకు అనుమతించినవి కేవలం 1,70,000 మాత్రమే. వీటి ద్వారా ఇప్పటి వరకూ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.120 కోట్లు. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3, ఎల్‌4 దశల్లో దరఖాస్తుల పరిశీలనకు తొలుత మార్గదర్శకాలు ఇచ్చి, తర్వాత సవరించారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో మరింత జాప్యమవుతుండడంతో మార్పులు చేశారు. ప్రస్తుతం ఎల్‌1 దశలో పరిశీలించిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా ఉంటే క్రమబద్ధీకరణకు ఆమోదం తెలుపుతున్నారు. అలాగే నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం సంయుక్త విచారణ చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని సడలింపులు చేశారు. జలవనరులకు 200 మీటర్ల దూరంలో ఉండే సర్వే నంబర్లు, ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉండే సర్వే నంబర్ల విషయంలో మాత్రమే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల అభిప్రాయాలను తీసుకునేలా మార్పులు చేశారు.


పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణం

రాష్ట్రంలో మునిసిపాలిటీల పరిధిలో 14,38,440 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు పరిశీలించిన దరఖాస్తులు కేవలం 3,74,825 మాత్రమే. మునిసిపాలిటీల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఆదాయం రూ.106.53 కోట్లు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మునిసిపాలిటీ పరిధిలో 3788 దరఖాస్తులు వస్తే ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఒక్క రూపాయి రాలేదు. వరంగల్‌ గ్రామీణ పరిధిలో ఉన్న వర్ధన్నపేటలోనూ ఇదే పరిస్థితి. అక్కడ 522 దరఖాస్తులు వస్తే నేటికీ రూపాయి వసూలు కాలేదు. ఇలా పలు చోట్ల దరఖాస్తులు వచ్చినా.. రూపాయి కూడా వసూలు కాలేదు. పట్టణ పరిధిలో వచ్చిన దరఖాస్తుల్లో 1,44,925 మందికి ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించాలని సమాచారం పంపితే 14206 మంది మాత్రమే కట్టేందుకు ముందుకు వచ్చారు.


క్రమబద్ధీకరణ రుసుములు ఇలా..

2020 సెప్టెంబరు 16న ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి సంబంధించి అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుములపై ప్రభుత్వం జీవో 135 జారీ చేసింది. తొలుత 131 జీవోను 2020 ఆగస్టు 31న ఇచ్చింది. ఇందులో టేబుల్‌1లో ఎల్‌ఆర్‌ఎస్‌ కనీస క్రమబద్ధీకరణ రుసుము ఎంత వసూలు చేయాలో నిర్ణయించింది. తర్వాత 135 జీవోలో మార్కెట్‌ విలువ మీద ఉన్న క్రమబద్ధీకరణ రుసుముల శాతాన్ని సవరిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇది ఆయా ప్రాంతాల్లో ఉండే మార్కెట్‌ విలువలు, భూ విస్తీర్ణం ఆధారంగా మారుతుంది. గజం రూ.3-5 వేల వరకు ఉంటే 30 శాతం, రూ.5-10 వేల మధ్య ఉంటే 40 శాతం, రూ.10-20 వేల మధ్య ఉంటే 50 శాతం, రూ.20-30 వేల మధ్య ఉంటే 60 శాతం, రూ.30-50 వేల మధ్య ఉంటే 80 శాతం, రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే 100 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేని లేఅవుట్‌లో 10 శాతం ఖాళీ స్థలం లేకపోయినప్పటికీ. నేరుగా భవనాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుముతోపాటు 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ చార్జీ, అదనంగా 33ు కాంపౌండ్‌ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకుంటే ఈ 33ు అదనపు రుసుము పడదని అధికారులు చెబుతున్నారు. జీవో నంబరు 131లో 100 చదరపు మీటర్ల విస్తీర్ణానికి చదరపు మీటరుకు రూ.200 కనీస క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాలి. ఆ తర్వాత చదరపు మీటరును బట్టి రుసుము మారుతుంటుంది. డీటీసీపీ దేవేందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుముల్లో 10ు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించకుండా నేరుగా బిల్డింగ్‌ అనుమతులు కోరితే ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలతోపాటు 33ు అదనంగా కాంపౌండ్‌ ఫీజు విధిస్తామని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వెళితే ఈ చార్జీలు కట్టాల్సిన అవసరం ఉండదని చెప్పారు.


స్పందన లేకపోవడానికి కారణం ఏంటి?

దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి అధికారుల పరంగా కొన్ని ఇబ్బందులు ఉండగా.. ప్రజల నుంచి స్పందన లేకపోవడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. దరఖాస్తుల పరిశీలన చేపట్టిన తర్వాత మధ్యలో ఒకసారి వరదలపై సర్వే, మరోసారి కులగణన, ఇంకోసారి ప్రభుత్వ విజయోత్సవాలు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే వంటి అంశాల వల్ల కొంత జాప్యం జరిగింది. దీంతోపాటు ఐదేళ్ల నాటి దరఖాస్తులు కావడం, ఆ రోజు దరఖాస్తు చేసిన వ్యక్తి ఒకరు, ప్రస్తుతం ప్లాట్‌ యజమాని మరొకరు ఉండడం, కొన్ని సర్వే నంబర్లను తప్పుగా నమోదు చేయడంతో ప్లాట్లను గుర్తించలేకపోవడం, 60 శాతం దరఖాస్తులకు సరైన పత్రాలు లేకపోవడం, ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఏముందిలే అని కొందరు ఆలోచన చేయడం వంటి కారణాల వల్ల కూడా ఆశించిన పురోగతి లేదని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 15 , 2025 | 03:55 AM