Ramappa Temple: హెరిటేజ్ వాక్ లోపాలపై ఆరా!
ABN , Publish Date - May 16 , 2025 | 03:29 AM
ప్రపంచ సుందరీమణుల ఓరుగల్లు టూర్ వివాదాస్పదం కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రామప్పలో అసలు ఏం జరిగింది? అనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటోంది.
రామప్ప ఘటనను సర్కారు సీరియస్
సుందరీమణుల కాళ్లు తుడిచారా.. నీళ్లు ఇచ్చారా?
వేయి స్తంభాల గుడిలో ఏర్పాట్లపైనా ఆరా
వరంగల్, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరీమణుల ఓరుగల్లు టూర్ వివాదాస్పదం కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రామప్పలో అసలు ఏం జరిగింది? అనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటోంది. వరంగల్ వెయ్యి స్తంభాల గుడితో పాటు ములుగు జిల్లా రామప్పలో సుందరీమణులు కాళ్లు కడుక్కునేందుకు రాగి తాంబాలాలు, చెంబులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రామప్పలో అందాలభామలు కాళ్లపై కొందరు వలీంటర్లు నీళ్లు పోయగా, వారిలో ఒకరు ఓ అందాల భామ కాళ్లను తెల్లని వస్త్రంతో తుడిచినట్టుగా వీడియోల్లో రికార్డయింది. విదేశీ వనితల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్నట్లు సమాచారం. రామప్పలో అసలేం జరిగింది? అందాల భామల కాళ్లకు నీళ్లు ఇవ్వాలని లేదా కాళ్లను వస్త్రంతో తుడవాలని ఎవరైనా ఆదేశించారా? లేదంటే అనుకోకుండా జరిగిందా?అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచా రం. రామప్పలో కార్యక్రమాన్ని ఏ అధికారి సమన్వయం చేసుకుంటున్నారు? ఆ సమయంలో ఆ అధికారి ఎక్కడికెళ్లారు?అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. పత్రికలతోపాటు సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావటంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్టు తెలిసింది.
వేయిస్తంభాల గుడిలో ఏర్పాట్లపై..
హనుమకొండలోని వేయిస్తంభాల గుడిలో ఏర్పాట్లు అసంతృప్తిగా ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఆలయం ఆవరణలో చీకటి వాతావరణం ఉండటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా సాదాసీదాగా నిర్వహించటంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. మీడియాకు అనుమతిచ్చేందుకు అడ్డగోలు నిబంధనలు పెట్టిన అధికారులు.. ప్రజాప్రతినిధుల అనుచరులను అనుమతించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం రాత్రి 9గంటలకే హరిత కాకతీయ నుంచి హైదరాబాద్‌కు పంపించాల్సిన సుందరీమణులను సుమారు రాత్రి 11గంటల వరకు ఇక్కడే ఉంచడంపైనా ఉన్నతాధికారులు సీరియ్‌సగా తీసుకున్నట్టు తెలిసింది. ఒకరిద్దరు అధికారులు, ప్రజాప్రతినిధుల అతి ప్రవర్తనతో ఆశించిన స్థాయిలో హరితలో సుందరీమణులకు అతిథ్యం అందలేదని చర్చ జరుగుతోంది. ఈ ఘటనలపై నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News