CM Revanth Reddy: పర్యాటకానికి పెద్దపీట
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:42 AM
తెలంగాణ ప్రభుత్వం ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక విధానం ఉండాలని భావిస్తోంది.

10 లోగా సమగ్ర పర్యాటక విధానం రూపొందించాలి
సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక విధానం ఉండాలని భావిస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 10వ తేదీలోగా సమగ్ర పర్యాటక విధానాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాలను ప్రాతిపదికగా చేసుకొని పాలసీని రూపొందించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర పర్యాటక విధానంపై బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశీయంగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పర్యాటక పాలసీలతో పాటు అంతర్జాతీయంగా ప్రముఖమైన పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీ) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు ఏర్పడతాయని, తద్వారా పర్యాటకుల ఆకర్షణ సులువవుతుందని చెప్పారు.
ఇక రాష్ట్రంలోని కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. సమ్మక్క-సారక్క, రామప్ప ఆలయం, లక్నవరంను సర్య్యూట్‌గా తీర్చిదిద్దాలని, నాగార్జునసాగర్, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో కేరళ తరహాలో బోటు హౌస్‌ల ద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో బౌద్ద పర్యాటక ప్రదేశాలను కలుపుతూ బౌద్ద సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. సమ్మక్క-సారక్క జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సింగపూర్ వంటి దేశాలు తక్కువ ప్రదేశంలో వైవిధ్యమైన ప్రణాళికలతో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ స్కైవాక్, సర్య్యూట్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అనంతగిరితోపాటు ఇతర ప్రాంతాల్లోనూ వసతులు మెరుగుపరచాలన్నారు.
ఇస్రోకు సీఎం రేవంత్ అభినందనలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం నిర్వహించిన 100వ అంతరిక్ష ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీఎ్‌సఎల్వీ ఎఫ్-15 రాకెట్ విజయవంతంగా ప్రయోగించిన అనంతరం శాస్త్రవేత్తలను అభినందించారు. దేశానికి సంబంధించి ఇది భారీ విజయమని కొనియాడారు.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి