Share News

వైద్యుల సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:40 AM

ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యులకు పదోన్నతులు కల్పించాలని, రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ గ్రేడ్‌ హెల్త్‌ సర్వీసె్‌సగా మార్చాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కోరింది.

వైద్యుల సమస్యలు పరిష్కరించండి

  • మంత్రికి వైద్యుల సంఘం వినతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యులకు పదోన్నతులు కల్పించాలని, రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ గ్రేడ్‌ హెల్త్‌ సర్వీసె్‌సగా మార్చాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కోరింది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంఘం ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జీవో నంబరు 142లోని లోపాలను వెంటనే సరిదిద్దాలని కోరారు. అదే విధంగా ప్రతీ జిల్లాకు డీఎంహెచ్‌వో పోస్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


అయా విభాగాల పరిధిలో పోస్టుల సంఖ్యను పెంచాలని, దంత వైద్యులను ప్రజారోగ్య విభాగంలో కొనసాగించాలని విన్నవించారు. వైద్యుల సంఘం ప్రతినిధుల విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. వారి సమస్యల పరిష్కారంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ నరహరి, కోశాధికారి డాక్టర్‌ రవూ్‌ఫతో పాటు పలువురు వైద్యులు ఉన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 04:40 AM