Elections: 9 పార్టీలకు ఈసీ నోటీసులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:53 AM
లోక్‌సత్తాతోపాటు గుర్తింపు లేని 8 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని ఆ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు.
25 లోపు జవాబివ్వాలి
కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు
హైదరాబాద్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): లోక్‌సత్తాతోపాటు గుర్తింపు లేని 8 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని ఆ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు ఈ నెల 25 లోపు సమాధానం ఇవ్వడంతోపాటు సరైన ఆధారాలు సమర్పించాలని మంగళవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈసీ నోటీసులు అందుకున్న పార్టీల్లో ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ (హైదరాబాద్), ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ (మేడ్చల్- మల్కాజ్‌గిరి), బీసీ భారతదేశం పార్టీ (హైదరాబాద్), భారత లేబర్ ప్రజా పార్టీ (భద్రాద్రి-కొత్తగూడెం), లోకసత్తా పార్టీ (హైదరాబాద్), మహాజన మండలి పార్టీ (హైదరాబాద్), నవ భారత్ నేషనల్ పార్టీ (మేడ్చల్- మల్కాజ్‌గిరి), తెలంగాణ ప్రగతి సమితి (మేడ్చల్-మల్కాజ్‌గిరి), తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ (మేడ్చల్- మల్కాజ్‌గిరి) ఉన్నాయి.
హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, భద్రాద్రి-కొత్తగూడెం) జిల్లాల కలెక్టర్లకు ఈ నోటీసులను పంపిన సీఈఓ.. సదరు పార్టీల పేర్లను దిన పత్రికలు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురించి ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News