Share News

Hyderabad: తెలుగుతల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:40 AM

తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్చే అంశానికి స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి సెక్రటేరియట్‌ వరకు కలిపే వంతెన పేరు మార్చాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.

Hyderabad: తెలుగుతల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌

- పేరు మారుస్తూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీలో నిర్ణయం

- 14 ఎజెండా అంశాలకు ఆమోదం

హైదరాబాద్‌ సిటీ: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌(Telugu Thalli Flyover)ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్చే అంశానికి స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి సెక్రటేరియట్‌ వరకు కలిపే వంతెన పేరు మార్చాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. అలాగే డిప్యూటీ కమిషనర్లకు ట్రేడ్‌ బోర్డ్సు, ప్రకటన లైసెన్స్‌ జారీ అధికారం కల్పించారు.


జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) ఆధ్వక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్‌ ఐటమ్‌లకు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.


city1.2.jpg

ఆమోదించిన కొన్ని ముఖ్యాంశాలు

- హెచ్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆర్‌కే.పురం వద్ద ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మాణానికి 45 మీటర్ల రోడ్డు వెడల్పు కోసం 52 ఆస్తుల సేకరణ

- అల్వాల్‌ సర్కిల్‌లో రూ.2.95 కోట్ల అంచనా వ్యయంతో బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణానికి టెండర్లకు ఆమోదం. యాకుత్‌పురా ఎస్‌ఆర్‌టీ కాలనీలో లండన్‌ బ్రిడ్జి పునర్నిర్మాణ వ్యయం రూ.2.95 కోట్లకు ఆమోదం.

- మల్లేపల్లిలో రూ.4.85 కోట్లతో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ ఆధునికీకరణ

- నాగోల్‌ సరస్సు నుంచి ఎస్‌ఎన్‌డీపీ డ్రెయిన్‌ వరకు బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణ వ్యయం రూ. 2.98 కోట్లతో అనుమతి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎఫ్‌ఎంసీజీకి జీఎస్‌టీ తంటా

మతమేదైనా జాతీయతే ప్రధానం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 06:57 AM