Hyderabad Olympics Bid: 2036 ఒలింపిక్ బిడ్‌కు కసరత్తు
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:07 AM
హైదరాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ నిర్వహణకు గాను బిడ్ వేసేందుకు గల అవకాశాలపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా గురువారం (ఈనెల 28న) తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు గవర్నర్స్ సమావేశం జరుగనుంది.
రేపు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కీలక సమావేశం
హాజరుకానున్న సీఎం రేవంత్, క్రీడా ప్రముఖులు
స్టేడియాల ఆధునికీకరణ, 56 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణంపై చర్చ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ నిర్వహణకు గాను బిడ్ వేసేందుకు గల అవకాశాలపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా గురువారం (ఈనెల 28న) తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు గవర్నర్స్ సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవనుండటం గమనార్హం. ఈ భేటీలో రాష్ట్రాన్ని క్రీడాహబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. సమావేశంలో గచ్చిబౌలి, హకీంపేటలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ క్యాంప్‌సలు, ఎక్స్‌లెన్స్ సెంటర్లు, స్పోర్ట్స్ సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు, ఎంపిక చేసిన 14 క్రీడాంశాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీల స్థాపన, ఎల్బీ, సరూర్‌నగర్ స్టేడియాల ఆధునికీకరణ, హకీంపేటలో పారా అథ్లెటిక్స్ సాధనకు మౌలిక సదుపాయాల కల్పనపై బోర్డు చర్చించనుంది.
56 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణంపై చర్చించనున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. సమావేశంలో బోర్డు సభ్యుల్లోని కార్పొరేట్ ప్రముఖులు కొణిదెల ఉపాసన, సంజీవ్ గోయెంకా, కావ్యా మారన్, విటా దని, శశిధర్, క్రీడా ప్రముఖులు అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, రవికాంత్ రెడ్డి, కపిల్‌దేవ్, క్రీడాశాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..