Telangana Rising Global Summit: తొలి రోజే రికార్డు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:17 PM
రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. తొలి రోజే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది.
హైదరాబాద్, డిసెంబర్ 08: రాష్ట్ర ఖ్యాతిని ఘనంగా చాటేలా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’(Telangana Rising Global Summit)ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమిట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ, ఆర్థిక సదస్సు కోసం దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. రేపటి సమిట్ కోసం ఇంకా పెద్ద సంఖ్యలో ప్రముఖులు తరలి వస్తున్నారు. . భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తున్న ఈ సమిట్ లో అంచనా కు మించి తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలు, సంస్థలతో ఎంవోయులు చేసుకుంది. నేడు ఒక్క రోజే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం(Telangana MOUs) కుదుర్చుకుంది.
ఒక్క పవర్ సెక్టార్ లోనే రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదిరింది. ఈ ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్‌సిటీ( Future City summit)లో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు గుజరాత్‌లోని వన్యప్రాణుల పునరావస కేంద్రం వంతారా యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వంతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రేపు ఐటీ(Telangana IT entertainment deals) , వినోదం సెక్టార్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఇవాళ(సోమవారం) జరిగిన సమ్మిట్ కు రెండు వందల మంది విదేశి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ కు దేశ ,విదేశాల నుంచి నాలుగు వేల మంది హాజరవుతారని అంచనా.
సోమవారం ప్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. 2047కు సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్నదే తమ ఆశయమని ఆయన స్పష్టం చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సహకరించిన వారందరికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల సూచనలను ఆహ్వానిస్తున్నామన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ వేశారని వివరించారు. అలాగే తాము సైతం తెలంగాణ(Telangana) భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలని అనుకున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ