Medchal surrogacy: మేడ్చల్ సరోగసీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 10:19 AM
మేడ్చల్ జిల్లాలో అక్రమంగా సరోగసీ (Surrogacy) దందా నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సరోగసీ వ్యవహారానికి అంగీకరించిన మహిళలతో సహా మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మేడ్చల్ జిల్లాలో అక్రమంగా సరోగసీ (Surrogacy) దందా నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సరోగసీ వ్యవహారానికి అంగీకరించిన మహిళలతో సహా మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో రూ.6.74 లక్షల నగదు, కొన్ని బాండ్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు (Medchal surrogacy).
అద్దె గర్భం మోయడానికి అంగీకరించిన మహిళల చేత నిందితురాలు లక్ష్మి, నరేందర్ రెడ్డి ప్రామిసరీ బాండ్ పేపర్లు రాయించుకున్నారు. అద్దెగర్భానికి అంగీకరించిన ఒక్కో మహిళకు రూ.5 లక్షలు చొప్పున ఇస్తున్నారు. ఇక, సరోగసీ ద్వారా పిల్లలను కనాలనుకుంటున్న తల్లిదండ్రుల నుంచి రూ.20 నుంచి 25 లక్షలు తీసుకుంటున్నారు. గతంలో ఇదే కేసులో లక్ష్మిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జులై నుంచి విడుదలైన లక్ష్మి తిరిగి హైదరాబాద్‌లో అదే దందా కొనసాగిస్తోంది.
పోలీసుల సోదాల్లో ఘటనా స్థలంలో ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు లభ్యమయ్యాయి. ఐవీఎఫ్ సెంటర్‌కు వచ్చిన దంపతుల వివరాలను లక్ష్మి ఏజెంట్ల ద్వారా సేకరిస్తోంది. వారిని సరోగసీ వైపు ఆకర్షించి డబ్బులు సంపాదిస్తోంది. లక్ష్మి ఇల్లు సహా శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్‌కు సంబంధించిన కొన్ని రిపోర్ట్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు ఐవీఎఫ్ హాస్పిటల్స్‌తో లక్ష్మికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News