Ganesh Chaturthi: గవర్నర్, సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:13 AM
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను తొలగించాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగాలని ఆకాంక్ష
హైదరాబాద్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను తొలగించాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా అందరూ మట్టి గణపతులను పూజించాలని గవర్నర్ సూచించారు. మంగళవారం ఆయన రాజ్‌భవన్ సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను అందించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం సైతం వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరిసేలా గణనాథుడు దీవించాలని ఆకాంక్షించారు.
టీచర్ల పదోన్నతుల ప్రక్రియ పూర్తి
పాఠశాల విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 880 మంది స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందారు. వారిలో మల్టీజోన్-1లో 490, మల్టీజోన్-2లో 390 మంది ఉన్నారు. అలాగే, ప్రాథమిక పాఠశాలల్లో బోధించే 3,574 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ) కూడా పదోన్నతులు పొందారు. వీరిలో 811 మంది ప్రాధానోపాధ్యాయులుగా, 2,763 మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందినవారు కొత్త స్థానాల్లో చేరేందుకు 15 రోజుల గడువు ఉంది. అప్పటిలోగా తమ స్థానాల్లో చేరాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..