TG News: పురపాలికలకు నిధులు వచ్చేశాయ్..
ABN , Publish Date - Oct 28 , 2025 | 07:37 AM
నిధుల లేమితో సతమతమవుతున్న పురపాలికలపై రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపింది. ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో అత్యవసర పనుల కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.239.40 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- విలీన గ్రామాల ప్రజలకు ఊరట
- రూ.239.40 కోట్లు మంజూరు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి): నిధుల లేమితో సతమతమవుతున్న పురపాలికలపై రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపింది. ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో అత్యవసర పనుల కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.239.40 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూడిఎఫ్) కింద కేంద్రం నిధులు అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మిగతా మొత్తాన్ని అందిస్తోంది. ఈ నిధులతో సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యాలతో పాటు డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.
నగర శివార్లలోని మున్సిపాలిటీ(Municipality)ల్లో విలీనమైన గ్రామాల్లో కొంత కాలంగా ఎలాంటి అభివృద్ధి పనులూ జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కొరత ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో ప్రభుత్వం అత్యవసర పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 42 కోట్లు
ఉమ్మడిజిల్లాలోని 13 పురపాలికలకు రూ. 239.40 కోట్లు మంజూరు చేయగా ఇందులో దాదాపు రూ.42 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మంజూరు చేసింది. మిగతా నిధుల మొత్తాన్ని కేంద్రం నేషనల్ హౌజింగ్ బ్యాంకు సహకారంతో అందజేస్తోంది. ప్రభుత్వం ఇలా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో శివారుపురపాలికల్లో ధీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులకు మోక్షం కలగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News