Share News

సీఎంవో వ్యవహారాలన్నీ శేషాద్రికి!

ABN , Publish Date - May 10 , 2025 | 04:14 AM

ఇక సీఎం మరో ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు.. రవాణాతోపాటు రోడ్లు, భవనాలు, గృహనిర్మాణం, దేవాదాయ శాఖ, సమాచార, పౌరసంబంధాలు, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.

సీఎంవో వ్యవహారాలన్నీ శేషాద్రికి!

  • రేవంత్‌రెడ్డి కార్యాలయంలో అధికారుల శాఖల మార్పు

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయంలో పలువురు అధికారుల శాఖలను ప్రభుత్వం మార్చింది. సీఎం రేవంత్‌రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా ఉన్న వి.శేషాద్రికి సాధారణ పరిపాలన శాఖతోపాటు శాంతిభద్రతలు, న్యాయశాఖ, హోం, ఆర్థికం, ప్రణాళిక, శాసన వ్యవహారాలు, భూ రెవెన్యూ, ఆహార పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, వ్యవసాయం, పశుసంవర్థకం, పాడి పరిశ్రమ అభివృద్ధి, సహకార, మార్కెటింగ్‌ శాఖలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు సీఎంవోలోని ఇతర అధికారులు, సిబ్బంది విధుల సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలు కూడా శేషాద్రి నిర్వహించనున్నారు. సీఎంవోలో పనిచేసే అధికారులంతా కీలక అంశాలపై ఈయనతోనే చర్చించాల్సి ఉంటుంది.


ఇక సీఎం మరో ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు.. రవాణాతోపాటు రోడ్లు, భవనాలు, గృహనిర్మాణం, దేవాదాయ శాఖ, సమాచార, పౌరసంబంధాలు, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. కాగా, సీఎం కార్యదర్శిగా ఉన్న కె.మాణికరాజ్‌.. మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ, నీటిపారుదల, రెవెన్యూ (వాణిజ్య పన్నులు, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌), గనులు, భూగర్భ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు, విపత్తు నిర్వహణ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల బాధ్యతలు పర్యవేక్షించనున్నారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డికి ఇంధనశాఖ, విద్యాశాఖ, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, కమ్యూనికేషన్స్‌, కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీలతోపాటు సీఎం భద్రత, అపాయింట్‌మెంట్లు, సీఎంవో అడ్మినిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించారు. ఇక సీఎం ఓఎస్డీగా ఉన్న వేముల శ్రీనివాసులు.. మహిళా, శిశు, వికలాంగ, వృద్ధుల సంక్షేమం బాధ్యతలు, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 04:14 AM