BC Reservations: బీసీ సంఘాల బంద్ ఎఫెక్ట్.. క్యాబ్‌ల్లో డబుల్ ఛార్జీలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 10:09 AM
ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేటు క్యాబ్ దందా జోరుగా సాగుతోంది. బస్సులు నడవకపోవడంతో ఎలాగూ క్యాబుల్లో ప్రయాణించాలి కాబట్టి చార్జీలు భారీగా పెంచారు. ప్రయాణికుల నుంచి అధికశాతం చార్జీలు వసూలు చేయడంతో లబోదిబోమంటున్నారు. ఉప్పల్ నుంచి హనుమకొండకు క్యాబ్ డ్రైవర్లు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.300 తీసుకుంటుండగా.. నేడు బంద్ ప్రభావం కారణంగా రూ.700 వసూలు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 18: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సుల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేటు క్యాబ్ దందా జోరుగా సాగుతోంది. బస్సులు నడవకపోవడంతో ఎలాగూ క్యాబుల్లో ప్రయాణించాలి కాబట్టి చార్జీలు భారీగా పెంచారు. ప్రయాణికుల నుంచి అధికశాతం ఛార్జీలు వసూలు చేయడంతో లబోదిబోమంటున్నారు. ఉప్పల్ నుంచి హనుమకొండకు క్యాబ్ డ్రైవర్లు డబుల్ ఛార్జీలు వసూలుచేస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.300 తీసుకుంటుండగా.. నేడు బంద్ ప్రభావం కారణంగా రూ.700 వసూలు చేస్తున్నారు.
నగరంలోని సిటీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అవడంతో సొంత ఊర్లకు వెళ్లేవారు నానా తంటాలు పడుతున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్రో రైళ్ల సర్వీసులు యధావిధిగా కొనసాగుతుండటంతో మెట్రో కిక్కిరిసిపోయింది. ప్రధాన మెట్రో స్టేషన్ల వద్ద, ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్, అమీర్ పేట్ వంటి కేంద్రాల్లో భారీగా ప్రయాణికులు చేరుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల నేతల ఆందోళన చేపట్టారు. జూబ్లీ బస్ స్టేషన్ (JBS)లో బీసీ సంఘాలు బైఠాయించాయి. జేబీఎస్ దగ్గర బంద్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ, హయత్‌నగర్, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ చేపట్టాయి. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ బస్ డిపో వద్ద బీసీ బంద్ ఉద్ధృతంగా సాగుతోంది. ఉదయం నుంచే రోడ్డెక్కి బీసీ సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు వ్యాపార సంస్థలను బంద్ చేయిస్తున్నారు. ప్రైవేటు బస్సులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులకు, బీసీ సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చెలరేగింది.
బీసీ బంద్ జరుగుతున్న వేళ కరీంనగర్‌లోని హోటల్ శ్వేత తెరచి ఉంచారు. దీంతో సీపీఐ నాయకులు హోటల్ లోకి వెళ్లి ఫర్నిచర్, సామాగ్రి ధ్వంసం చేశారు. హోటల్ మూసివేసి బంద్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అయినా హోటల్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ధ్వంసం చేశారు.
ఇవి కూడా చదవండి:
Nizamabad Constable Murder: కానిస్టేబుల్ హత్యపై డీజీపీ కీలక ఆదేశాలు..
Katta Ramchandra Reddy: స్వగ్రామానికి కట్టా రామ్‌చంద్రారెడ్డి మృతదేహం.. కాసేపట్లో అంత్యక్రియలు