Share News

Municipal Administration: 30 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్‌విభజనకు షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:18 AM

ముప్పై మున్సిపాలిటీల్లో విలీనం కానున్న గ్రామ పంచాయతీలను వార్డులుగా పునర్‌విభజన చేయడానికి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సోమవారం ఉత్తర్వులిచ్చారు.

Municipal Administration: 30 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్‌విభజనకు షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ముప్పై మున్సిపాలిటీల్లో విలీనం కానున్న గ్రామ పంచాయతీలను వార్డులుగా పునర్‌విభజన చేయడానికి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీలోపు 19 రోజుల్లో పునర్‌విభజన ప్రక్రియ పూర్తిచేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్‌ 21న తుది నోటిఫికేషన్‌ విడుదల చేయాలని పేర్కొన్నారు. 43 మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న 13 మున్సిపాలిటీల్లో వాయిదా వేశారు. తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ కింద ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నందున ఈ మున్సిపాలిటీలను మినహాయించినట్లు పురపాలక శాఖ అధికారులు తెలిపారు.


అవినీతి అధికారులపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): అవినీతికి పాల్పడిన వివిధ విభాగాల్లోని అధికారులపై నమోదు చేసిన కేసులు, దర్యాప్తు వివరాల నివేదికను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో 112 మంది ఉద్యోగులపై నమోదైన అవినీతి కేసులకు సంబంధించి ఈ ఏడాది జనవరి నుంచి మే చివరి నాటికి జరిగిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలతో తుది నివేదికను ప్రభుత్వానికి ఏసీబీ ఉన్నతాధికారులు అందించారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా లంచం, అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించిన మొత్తం 19 అవినీతి కేసులను నమోదు చేశారు. ఆయా కేసుల్లో మొత్తం 25 మంది ప్రభుత్వోద్యోగులను ట్రాప్‌ చేసి, రెడ్‌హ్యాండెడ్‌గా, ఆకస్మిక తనిఖీల్లో పట్టుకుని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 04:18 AM