Share News

Staff Nurse Results: స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 06 , 2025 | 04:14 AM

స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో తమ మార్కులు తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి సోమవారం వెల్లడించారు.

Staff Nurse Results: స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో తమ మార్కులు తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. గతేడాది నవంబరు 23న జరిగిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఫలితాలతోపాటు ఫైనల్‌ కీని వెబ్‌సైట్‌లో ఉంచారు. మొత్తం 2,322 నర్సు పోస్టులకుగాను 42,244 మంది దరఖాస్తు చే యగా 40,423 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రెండు సెషన్లలో జరిగింది.


దీంతో మార్కులను నార్మలైజేషన్‌ చేశారు. కాగా ఉదయం సెషన్‌ వారికి ఒకటి రెండు మార్కులు పెరగ్గా... సాయంత్రం రాసిన వారికి ఒకటి రెండు తగ్గినట్లు అభ్యర్థులు తెలిపారు. తాజాగా విడుదలైన మార్కులకు వెయిటేజ్‌ మార్కులను కలిపి త్వరలోనే ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నట్టు మెడికల్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:14 AM