Seethakka: దయ్యం నువ్వేనా కేటీఆర్?
ABN , Publish Date - May 25 , 2025 | 03:50 AM
కవిత లేఖతో కేటీఆర్ చిన్న మెదడు చితికిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కవిత చెప్పినట్టుగా కేసీఆర్ దగ్గర ఉన్న దయ్యం నువ్వేనా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

నిలదీసిన మంత్రి సీతక్క.. మోదీ ప్రశంసల కోసమే రాహుల్‌పై విమర్శలంటూ విమర్శ
కవిత లేఖతో కేటీఆర్‌కు మతి భ్రమించినట్లుంది.. పంపకాల్లో తేడాతోనే ఈ తిరుగుబాటు: మహేశ్‌గౌడ్
ఆ దయ్యాలెవరో కేటీఆరే చెప్పాలి: మంత్రి పొన్నం.. దయ్యాల స్కాంలు బయటపెట్టండి: చామల
ఆస్తుల్ని కాపాడుకునే యత్నం: మధుసూదన్‌రెడ్డి.. కవిత చెప్పిన దయ్యాలు ఆ ముగ్గురే: రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 24(ఆంధ్రజ్యోతి): కవిత లేఖతో కేటీఆర్ చిన్న మెదడు చితికిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కవిత చెప్పినట్టుగా కేసీఆర్ దగ్గర ఉన్న దయ్యం నువ్వేనా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. రాహుల్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. దేశ ప్రజల కోసం మాట్లాడుతున్న రాహుల్‌గాంధీపై మోదీ ఈడీని ప్రయోగిస్తున్నారని, మోదీ ప్రశంసల కోసం పాకులాడుతూ కేటీఆర్ పాకులాడుతున్నారని మండిపడ్డారు. సచివాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పత్రికకు తన వంతు సాయం చేశారని తెలిపారు. అధికారంలో లేనప్పుడు.. అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందని నిలదీశారు. కేటీఆర్‌కు ‘గోబెల్స్’ అవార్డు ఇవ్వొచ్చని వ్యంగ్యంగా అన్నారు. కాగా, కవిత లేఖతో కేటీఆర్ మతి భ్రమించిదని, సీఎం రేవంత్‌రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్‌కు పట్టిన దెయ్యం కేటీఆరేనని కవిత చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత లేఖ రాసినట్టుగా ఉందన్నారు. కవిత లేఖ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే నేషనల్ హెరాల్ ్డ కేసుపై కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పత్రికకు తమ పార్టీ నేతలు నిధులివ్వడం అవినీతి ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. పదేళ్ల అవినీతికి సంబంధించిన సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే కవిత తిరుగుబాటు జెండా ఎగరవేశారని ఆరోపించారు. కేటీఆర్, కవిత మధ్య వైరం తీవ్ర స్థాయికి చేరిందని, అదును కోసం హరీశ్ చూస్తున్నారని చెప్పారు. ఇవన్నీ తట్టుకోలేకనే కేసీఆర్ ఫాంహౌ్‌సకు పరిమితం అయ్యారన్నారు.
కేటీఆర్, కవిత, హరీశ్ తీరుతో బీఆర్‌ఎస్ మూడు ముక్కలవుతుందని, తెలంగాణలో ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమని అన్నారు. కాగా, కేసీఆర్ వద్ద ఉన్న దెయ్యాలు ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డాయో కవిత వివరించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ దయ్యాల అవినీతి, అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేయాలని కవితకు సూచించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో కేటీఆర్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో పొన్నం విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్ కాంగ్రె్‌సను విమర్శించడం మానుకొని.. సొంత పార్టీని చక్కదిద్దుకుంటే మంచిదని హితవు పలికారు. కవిత ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత కాంగ్రె్‌సను ప్రశ్నిేస్త మంచిదని సూచించారు. కాంగ్రెస్, సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన నిరాదార ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేటీఆర్.. తన పార్టీలో వివక్షపై స్పందించాలని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి హితవుచెప్పారు. కవిత చెబుతున్న దయ్యాలు సంతో్‌షరావు, కేటీఆర్, హరీశ్ రావేనని విమర్శించారు. నేడో, రేపో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, సంతో్‌షకు పదవి కట్టబెట్టే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ అంతర్గత అంశాలు చర్చకు రాకుండా కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే బీజేపీతో బీఆర్‌ఎస్ కుమ్మక్కైందని ఆరోపించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్‌కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించడం సిగ్గుచేటని, ఆయనకు తామంతా కవచంలా నిలబడతామన్నారు. కవిత లేఖతో బీఆర్‌ఎస్ దోపిడీ బయటపడిందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ విమర్శించారు. దోచుకున్న సొమ్ము పంపకాల్లో పంచాయితీ ఏర్పడినట్టుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి పట్టిన దయ్యం కేటీఆర్ అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ విమర్శించారు.
ఆ దయ్యాలెవరో కవితే చెప్పాలి: డీకే అరుణ
కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో ఎమ్మెల్సీ కవితనే చెప్పాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ సూచించారు. ‘‘కవిత రాసిన లేఖ ఆమె లేదా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ల్లో ఒకరు లీక్ చేసి ఉండాలి. వారెవరు అన్నది కవితనే చెప్పాలి. అమెరికా నుంచి వచ్చే ముందు రోజే ఆమె లేఖ ఎందుకు లీక్ అయ్యిందో కూడా వెల్లడించాలి. బీజేపీలోకి కవిత రావాలనుకున్నా..తీసుకునే ప్రసక్తే ఉండదు’’ అని స్పష్టం చేశారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల ఎజెండా అని దుయ్యబట్టారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పాత్ర ఏంటో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..