South Central Railway: దక్షిణమధ్య రైల్వేకు రూ. 10,143 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Oct 04 , 2025 | 07:00 AM
దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది. 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం లభించగా, ప్రయాణికుల విభాగం నుంచి రూ.2,991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
హైదరాబాద్ సిటీ: దక్షిణమధ్య రైల్వే(South Central Railway) ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది. 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం లభించగా, ప్రయాణికుల విభాగం నుంచి రూ.2,991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2024-25) ఏప్రిల్-సెప్టెంబరు మధ్య వచ్చిన ఆదాయం రూ. 9,966 కోట్లతో పోల్చితే ఈ ఏడాది ఆదాయం రూ.177 కోట్లు(1.7శాతం) అదనం.

సరుకు రవాణాలో మునుపెన్నడూ లేని విధంగా 71.14 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్‌ను సాధించింది. గతేడాది లోడ్ చేసిన 67 మిలియన్ టన్నుల కంటే 6 శాతం ఎక్కువ. దక్షిణమధ్యరైల్వే జోన్‌కు రికార్డు స్థాయిలో ఆదాయం పెరగడంపై జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ(GM Sanjay Kumar Srivastava) రైల్వే అధికారులను, ఉద్యోగులను అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News