Phone Tapping Case: మరోసారి పోలీసు కస్టడీకి శ్రవణ్‌రావు?
ABN , Publish Date - May 26 , 2025 | 04:46 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్‌రావును ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పిటిషన్ దాఖలు చేసిన సిట్
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్‌రావును ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో తనను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందిన శ్రవణ్‌రావును అనూహ్యంగా ఇనుప ఖనిజం చీటింగ్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత శ్రవణ్‌రావును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు కోర్టును ఆశ్రయించగా.. ఒక రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది.
ఈ క్రమంలో గత శుక్రవారం శ్రవణ్‌రావును సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. అయితే.. తనపై అక్రమంగా చీటింగ్ కేసు నమోదు చేశారని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండడంతో.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శ్రవణ్‌రావును కస్టడీకి తీసుకోవాలని సిట్ పోలీసులు ప్రయత్నాలను ప్రారంభించారు. వీలైనంత త్వరగా శ్రవణ్‌రావును పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకునే దిశలో అడుగులు వేస్తోంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వచ్చేనెల 20న జరగనున్న విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఆయన న్యాయస్థానంలో హాజరవ్వకపోతే.. కోర్టు అతణ్ని ‘ప్రకటిత నేరస్థుడు’గా పేర్కొనే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం