SC categorization: జస్టిస్ షమీమ్ కమిషన్ నివేదిక తప్పుల తడక
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:25 AM
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదిక తప్పులతడకని, మూడు గ్రూపులుగా వర్గీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని మాల సంక్షేమ సంఘం, సమతా సైనిక్ దళ్, మాల సంఘాల జేఏసీ ప్రతినిధులు అన్నారు.

4 నుంచి 14 వరకు నిరసనలు
15న సదస్సుల నిర్వహణ
త్వరలో లక్షలాది మందితో భారీ సభ
మాల సంక్షేమ సంఘం, సమతా సైనిక్ దళ్, మాల సంఘాల జేఏసీల ప్రకటన
పంజాగుట్ట, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదిక తప్పులతడకని, మూడు గ్రూపులుగా వర్గీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని మాల సంక్షేమ సంఘం, సమతా సైనిక్ దళ్, మాల సంఘాల జేఏసీ ప్రతినిధులు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమతా సైనిక్‌దళ్ నేత మార్షల్ దిగంబర్ కాంబ్లే, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, వివిధ సంఘాల నేతలు.. జస్టిస్ షమీమ్ కమిషన్ నివేదిక ప్రతులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఈ నెల 4న సామాజిక న్యాయ దినం పేరుతో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, కులగణన నివేదికలు ఏకపక్షంగా ఆమోదించి గొప్పలు చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. ఆ రోజును చీకటి రోజుగా, సామాజిక న్యాయ విద్రోహ దినంగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి కల్పించారన్నారు. ఈనెల 4 నుంచి 14 వరకు జస్టిస్ షమీ మ్ కమిషన్ నివేదికను తగలబెడుతూ నిరసన కా ర్యక్రమాలు చేపట్టాలని, 15న సామాజిక న్యాయ విద్రోహ దినం పేరిట సదస్సులు, సమావేశాలు ని ర్వహించాలని పిలుపునిచ్చారు. త్వరలోనే లక్షలాది మంది మాలలతో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో నేతలు భావనా సా హెబ్, రావుల అంజయ్య, సుధాకర్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Kavitha: కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు
Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ
Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News