Share News

Sangareddy: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కూలి పనులు

ABN , Publish Date - Jan 26 , 2025 | 05:46 AM

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఏబీహెచ్‌బీ కాలనీ-2 మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కూలి పనులు చేయించిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు.

Sangareddy: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కూలి పనులు

  • ముగ్గురు టీచర్ల సస్పెన్షన్‌.. కార్మికశాఖ షోకాజ్‌ నోటీసులు

సంగారెడ్డి అర్బన్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఏబీహెచ్‌బీ కాలనీ-2 మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కూలి పనులు చేయించిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. విద్యార్థులతో ఇటుకలు, కంకరరాళ్లు, ఇతరత్ర సామగ్రి మోయిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ ఘటన శుక్రవారం జరగ్గా స్పందించిన కలెక్టర్‌ ఆ పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు మంజుల, శారద, నాగమణిని సస్పెండ్‌ చేశారు.


బడి పిల్లలతో పని చేయించడాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌.. కార్మికశాఖ అధికారులతో విచారణకు ఆదేశించారు. వారు పాఠశాలకు చేరుకుని విచారించి ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Updated Date - Jan 26 , 2025 | 05:54 AM