Hyderabad: సీఎం రేవంత్‌ను కలిసిన సద్గురు
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:28 AM
తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి మీ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయంటూ సీఎం రేవంత్‌ను ప్రపంచ ఆర్థికసదస్సు (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బోర్గ్ బ్రేండ్ ప్రశంసించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్.. గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.
మీ ఆలోచనలు అద్భుతం..!
తెలంగాణ భవిష్యత్తుపై మీ దూరదృష్టి అమోఘం
సీఎం రేవంత్‌పై డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడి ప్రశంసలు..
హైదరాబాద్, ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి):తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి మీ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయంటూ సీఎం రేవంత్‌ను ప్రపంచ ఆర్థికసదస్సు (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బోర్గ్ బ్రేండ్ ప్రశంసించారు. రేవంత్ దూరదృష్టిని, సమర్థ ఆలోచన విధానాన్ని, సమాజహితం కోసం చేపడుతున్న కార్యక్రమాల్ని ఆయన కొనియాడారు. గత నెలలో దావో్‌సలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం పాల్గొని రూ.1.78 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు గురువారం సీఎంకు లేఖ రాశారు. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం విజయవంతం కావడాన్ని ఆయన అభినందించారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు సీఎం రచిస్తున్న ప్రణాళికలు బాగున్నాయని పేర్కొన్నారు. దేశంలోనే తొలి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో కార్బన్ సిటీ) నగరాన్ని హైదరాబాద్ సమీపంలో అభివృద్ధి చేయడం, 2047లోపు తెలంగాణను నెట్ జీరో రాష్ట్రంగా రూపొందించాల న్న లక్ష్యం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఏఐ సిటీ ఏర్పాటుతో దేశం లో సాంకేతిక రంగంలో తెలంగాణ తన ప్రత్యేకత చాటుతుందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News