Maoists Sunita: 40 ఏళ్ల అజ్ఞాతం వీడి.. లొంగిపోయిన కాకరాల సునీత
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:53 AM
నాలుగు దశాబ్దాల అజ్ఞాతాన్ని వీడి.. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్‌లకు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు గురువారం చెక్కులను అందజేశారు.
అగ్రనేతలకు సేవలందించిన హరీశ్ కూడా.. ఇద్దరికీ చెక్కులు అందించిన రాచకొండ సీపీ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాల అజ్ఞాతాన్ని వీడి.. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్‌లకు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు గురువారం చెక్కులను అందజేశారు. సునీతకు రూ.20 లక్షలు, హరీశ్‌కు రూ.4 లక్షల చెక్కులను ఇచ్చిన సీపీ.. వీరికి ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించేందుకు కృషిచేస్తానన్నారు. ఇప్పటివరకు తెలంగాణ పోలీసుల ఎదుట 387 మంది నక్సలైట్లు లొంగిపోయారని గుర్తుచేశారు. మావోయిజం సిద్ధాంతానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. గురువారం విలేకరుల సమావేశంలో సీపీ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘మావోయిస్టు అగ్రనేత, ఎన్‌కౌంటర్‌లో మరణించిన సుధాకర్ జీవిత సహచరిణి సునీత. అప్పట్లో సరైన ఆదాయ వనరుల్లేక చాలా మంది నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొంతకాలంగా నక్సల్స్ రిక్రూట్‌మెంట్లు నిలిచిపోయాయి. ఒకవేళ యువత అటువైపు ఆకర్షితులైనా.. భావజాలం నచ్చక తిరిగి వస్తున్నారు’’ అని సీపీ వ్యాఖ్యానించారు. సునీత సోదరి మాదవి ఇంకా మావోయిస్టు పార్టీలోనే ఉన్నారని చెప్పారు.
ఇదీ సునీత నేపథ్యం..
సునీత అసలు పేరు గురుస్మృతి. ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ విప్లవ రచయితల సంఘం(విరసం) సభ్యుడు. 200కు పైగా సినిమాల్లో నటించారు. సునీత 1985లో ఇంటర్ చదువుతూనే.. ర్యాడికల్ విద్యార్థి సంఘం(ఆర్‌ఎ్‌సయూ)లో చేరారు. 1986లో పీపుల్స్ వార్ గ్రూప్(పీడబ్ల్యూజీ)లో చేరి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే ఏడా ది టీఎల్‌ఎన్ చలం అలియాస్ గౌతమ్‌ను పెళ్లిచేసుకున్నారు. సునీత విజయవాడ సెంట్రల్ ఆర్గనైజర్‌గా.. ఆ తర్వాత గుంటూరు సెంట్రల్ ఆర్గనైజర్‌గా, ఆపై నల్లమల డివిజన్ కమిటీ, అనంతరం ఏవోబీ లో చలంతో కలిసి పనిచేశారు. జూన్ 5న అన్నపు రం ఎన్‌కౌంటర్‌లో టీఎల్‌ఎన్ చలం మరణించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News