Heavy Rains: ప్రహరీ గోడ కూలిన ఒకరు మృతి పలువురికి గాయాలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 09:37 AM
భారీ వర్షాల కారణంగా ప్రహరీ గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15: రంగారెడ్డి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాల్టీలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా.. సోమవారం తెల్లవారుజామున స్థానిక వీ కన్వెన్షన్ హాల్ ప్రహరీ గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఇక మృతదేహాన్నిసైతం పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడు గగన్ (50)గా పోలీసులు గుర్తించారు. ఇక వీ కన్వెన్షన్ హల్ ప్రహరీ గోడను అనుకుని అపర్ణ ఆర్ఎంసీ కంపెనీలో పని చేస్తున్న కార్మికులు షెడ్లుగా వేసుకుని వారు నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా షెడ్లపై గోడ కూలడంతో.. నిద్రిస్తున్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News