Share News

Rakul Preet Singh: తెలుగు సినిమాను చాలా మిస్‌ అవుతున్నా..

ABN , Publish Date - Dec 20 , 2025 | 08:15 AM

హైదరాబాద్‌లో ఉండటమంటే నాకు చాలా ఇష్టం.. తెలుగు సినిమాను చాలా మిస్‌ అవుతున్నా.. అని ప్రముఖ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు.

Rakul Preet Singh: తెలుగు సినిమాను చాలా మిస్‌ అవుతున్నా..

  • తెలుగు సినిమాను చాలా మిస్‌ అవుతున్నా: రకుల్‌ప్రీత్‌ సింగ్‌

హైదరాబాద్‌ సిటీ: తెలుగు సినిమాను, ప్రేక్షకులను తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానని, చక్కటి స్ర్కిప్ట్‌తో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తానని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Actress Rakul Preet Singh) తెలిపారు. తన మేకప్‌ ఆర్టిస్ట్‌ కడలి చక్రవర్తి (చక్రి) ఏర్పాటు చేసిన మేకప్‌ స్టూడియో, అకాడమీ ప్రారంభోత్సవానికి నగరానికి విచ్చేశారామె. పంజాగుట్టలో జరిగిన ఈ కార్యక్రమంలో రకుల్‌ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో కనిపించక పోవడం వల్ల ప్రేక్షకులకు దూరమయ్యానన్నారు.


city3.2.jpg

ఇక్కడి వారు తనపై చూపిన ప్రేమాభిమానాలను ఎన్నడూ మరిచిపోనన్నారు. హైదరాబాద్‌(Hyderabad)లో షూటింగ్‌ అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడ ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. తన మొదటి చిత్రం నుంచి చక్రీతో తనకు చక్కటి అనుబంధం ఉందని తెలిపారు. తనకు తెలుగు నేర్పిన వ్యక్తి ఆయనే అన్నారు. కాగా, తన ఎదుగుదలలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మద్దతు మరువలేనిదని చక్రి తెలిపారు.


city3.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!

బ్యాంకింగ్‌ వదిలి చాక్లెట్‌ మేకింగ్‌

Read Latest Telangana News and National News

city3,3.jpg

Updated Date - Dec 20 , 2025 | 08:18 AM