R. Krishnaiah: నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఊరుకోం..
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:42 AM
నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఊరుకోమని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. వనస్థలిపు రం ఏరియా ఆస్పత్రిలో 9 రోజులుగా ఆమర ణ నిరాహారదీక్ష చేస్తున్న అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
- ఉస్మానియాలో చికిత్స పొందుతున్న అశోక్‌కుమార్‌ను పరామర్శించిన నేతలు
హైదరాబాద్: నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఊరుకోమని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) అన్నారు. వనస్థలిపు రం ఏరియా ఆస్పత్రిలో 9 రోజులుగా ఆమర ణ నిరాహారదీక్ష చేస్తున్న అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈవిషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి మంగళవారం వేర్వేరుగా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్న అశోక్‌ను ఆర్.కృష్ణయ్య పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశా రు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి కావడానికి నిరుద్యోగులే ప్రధాన కారణమనే విషయాన్ని విస్మరించడం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నా రు. నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేస్తు న్న అశోక్ కుమార్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి దీక్ష విరమింపజేయాలన్నారు.

లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో ఆందోళన చేపడతామని ఆ యన హెచ్చరించారు. ఈవిషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రర్‌రావు మాట్లాడుతూ, ఐదు రూపాయల భోజనం చేస్తూ పోటీ పరీక్షల కోసం నిరుద్యోగులు సన్నద్ధమయ్యారని, నిరుద్యోగ అభ్యర్థు ల జీవితాలతో కాంగ్రెస్ పభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చి జీవో 20ను వెంటనే విడుదల చేయాలన్నారు.
అనంతరం దీక్షలో ఉన్న అశోక్ కుమార్ మాట్లాడుతూ, 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగ అభ్యర్థులను ఆదుకోవాలన్నారు. 2022 తర్వాత ఇప్పటివరకు ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయలేదని, తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిం టే నిరుద్యోగులను ఎందుకు చులకనగా చూ స్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొచ్చి నిమ్మరసం ఇస్తేనే దీక్ష విరమిస్తానని, నిరుద్యోగుల కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Read Latest Telangana News and National News