Electricity: మధ్యాహ్నం ఈ ఏరియాలో కరెంట్ బంద్..
ABN , Publish Date - Mar 08 , 2025 | 10:32 AM
విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ(Greenland's ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు 11కెవి కామత్ లింగాపూర్ హౌస్, ఇంటర్ గ్రాఫ్ ఫీడర్ల పరిధిలోని ప్రకా్‌షనగర్ ఎక్స్ టెన్షన్, వాటర్ ట్యాంక్, కామత్ లింగాపూర్ హౌస్, ఇంటర్ గ్రాఫ్ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు 11కెవి స్వరాజ్ నగర్ ఫీడర్ పరిధిలోని స్వరాజ్ నగర్ సైట్-2, సాయిబాబా నగర్(Sai Baba Nagar), పర్వత నగర్, అల్లాపూర్, బంజారా నగర్ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అమీర్‌పేట ఎంసీహెచ్ మార్కెట్(Ameerpet MCH Market), ది హిందూ ఫీడర్ల పరిధిలోని అపరాజిత కాలనీ, సాదత్ మంజిల్, ఎంసీహెచ్ మార్కెట్, ఎస్‌ఆర్టీ కాలనీ, వెంకట్ ప్లాజా, ఒర్రా, కృష్ణా జువెల్లర్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చిన్నారుల కొనుగోలు కేసులో కిలేడీ అరెస్టు..
ఈ వార్తను కూడా చదవండి:
తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News