Share News

PM Modi: దేవాదుల, ఎస్సారెస్పీపై 3న ప్రధాని సమీక్ష

ABN , Publish Date - Aug 24 , 2025 | 02:28 AM

కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి ప్రయోజన పథకం ఏఐబీపీ లో భాగంగా ఉన్న రాష్ట్రంలోని జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం..

PM Modi: దేవాదుల, ఎస్సారెస్పీపై  3న ప్రధాని సమీక్ష

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ)లో భాగంగా ఉన్న రాష్ట్రంలోని జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, రాజీవ్‌బీమా ఎత్తిపోతల పథకం, శ్రీరామ్‌సాగర్‌ రెండో దశ ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబరు 3న సమీక్ష నిర్వహించనున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉన్న క్యాబినెట్‌ సచివాలయంలో సెప్టెంబరు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రగతి సమావేశంలో తెలంగాణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2006 ఏప్రిల్‌ 3న ఏఐబీపీలో చేర్చగా, రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకాన్ని 2008 జనవరి 1న చేర్చారు. ఎస్సారెస్పీ రెండో దశను 2005 ఏప్రిల్‌ 1న ఏఐబీపీలో చేర్చారు. ఈ మూడు పథకాలను 2019 డిసెంబరు 31 కల్లా పూర్తి చేయాలని గడువు పెట్టగా పనులు పూర్తి కాలేదు. ఆ తర్వాత దేవాదులను 2025 డిసెంబరు 31, రాజీవ్‌ బీమాను 2026 మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. దీనికి అనుగుణంగా భూసేకరణకు భారీగా నిధులు కూడా విడుదల చేసింది. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఐదు సమస్యలు ఉన్నాయని గుర్తించగా.. సెప్టెంబరు 3న జరిగే సమీక్షలో ప్రధాని ఆయా అంశాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 02:28 AM