Share News

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌లో హీటెక్కిన ప్రచారం.. గల్లీలు, బస్తీలపైనే దృష్టి..

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:27 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి అంకానికి చేరింది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తు న్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభ్యర్థులు, పార్టీల ముఖ్యనాయకులు, వారి అనుచరులు నియోజకవర్గంలోని ఓటర్లను కలుసుకుంటున్నారు.

Jubilee Hills By Elections:  జూబ్లీహిల్స్‌లో హీటెక్కిన ప్రచారం.. గల్లీలు, బస్తీలపైనే దృష్టి..

ఎక్కువ ఓట్లు సాధించేందుకు నేతల యత్నాలు

కాలు దువ్వుతున్న ప్రధాన పార్టీల నేతలు

ఒక్క ఓటునూ చేజార్చుకోకుండా ఆకట్టుకుంటున్న ముఖ్య నాయకులు


హైదరాబాద్ సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి అంకానికి చేరింది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తు న్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభ్యర్థులు, పార్టీల ముఖ్యనాయకులు, వారి అనుచరులు నియోజకవర్గంలోని ఓటర్లను కలుసుకుంటున్నారు. కాలనీలు, బస్తీల నుంచే మెజారిటీ ఓట్లు సాధించేలా ప్రచారం ముమ్మరం చేశారు.


అధిక ఓట్లే టార్గెట్..

రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన ఆయా పార్టీల నాయకులకు జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని బస్తీలు, బూత్ల వారీగా కొద్ది రోజుల క్రితమే బాధ్యతలు అప్పగించారు. ప్రతీ 10వేల ఓట్లకు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ నేతకు ఇన్చార్జిగా నియమించి ప్రచారం చేయిస్తున్నారు. వారంతా తమ తమ నియోజక వర్గంలోని మండలాల్లో ముఖ్యనాయకులుగా ఉన్నవారిని నగరానికి రప్పించి తిప్పుతున్నారు. ఇదే సమయంలో వారికి 100-1200 ఓట్లు బాధ్యతను కల్లా బెట్టారు. మెజార్టీ బార్గెటీసు కూడా విధించారు. ప్రత్యర్థి పార్టీ కంటే మునకే ఎక్కువ ఓట్లు రావాలని, మొజార్జి సాదించి సత్తాచాటాలని సూచించారు. దీంతో సదరు నాయకులు తమ సొంత మండలంలో పనిచేసిన మాదిరిగా జూబ్లీహిల్స్లోని బస్తీలు, గల్లీల్లో కాలుకు బలపం కట్టుకున్నట్లుగా తిరుగుతుండం ఆసక్తికరంగా మారింది.


మరోవైపు సామాజిక వర్గాలతో ఆకర్షణ..

గల్లీలు, బస్తీలు, కాలనీల్లో ప్రచారం చేస్తున్న సందర్భంగా కొంతమంది నాయకులు ఓటర్ల సామాజిక వర్గాన్ని తెలుసుకుని ఆకట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. మైనార్టీ, యాదవ్, గౌడ, కమ్మ తదితర సామాజిక వర్గాలున్న కటుంబాల అడ్రస్‌ను ప్రచార సమయంలో స్థానిక కార్యకర్తల ద్వారా తెలుసుకుంటున్న నాయకులు.. తమది కూడా మీ సామాజిక వర్గమేనని వారితో మాటలు కలిపి సరదాగా ముచ్చటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇళ్లలో ఉండేవారితో పాటు దుకాణదారులు, నీ వ్యాపారులు, ఉద్యోగులందరిని కూడా ఇప్యాయంగా పలకరిస్తూ ఓటు బ్యాంకను పెంచుకుంటున్నారు జూబ్లీహిల్స్ ఎన్నిక అభ్యర్థుల కంటే ఇẮతార్జిలుగా భాధ్యతలు నిర్వర్తిస్తున్న ముఖ్య నాయకులకు ద్వితీయ శ్రేణి నాయకులకు సవాల్ గా మారిందని చెప్పవచ్చు. ఆయా ప్రాంతాల్లో ఓట్ల మెజ రిటీని బట్టి వారికి పార్టీలో ప్రాముఖ్యత దక్కనుందని భావిస్తున్నారు.


ఓటర్లను ఆకట్టుకునేలా..

జూబ్లీహిల్స్ ఎన్నికను ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గెలుపు అవకాశాలను మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో బాగంగా ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో కాలు దువ్వుతున్నారు. ఫలానా పార్టీతో ఏమి లాభం లేదని, మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని ఒకరు చెబుతుండగా, తాము నమ్మకానికి అమ్మలాంటి వారమని, ఎన్నికల్లో ఆశీర్వదించాలని మరో పార్టీ నేతలు పేర్కొం టున్నారు. పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతుండడం ఆసక్తిక రంగా మారింది. ఇలా, ఉదయం నుంచి రాత్రి వరకు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ మూడు ప్రధాన పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Investigation of defecting MLAs: ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్

Updated Date - Nov 07 , 2025 | 01:43 PM