Terrorism: ‘స్లీపర్ సెల్స్’ క్రియాశీలం కావచ్చు!
ABN , Publish Date - May 09 , 2025 | 03:00 AM
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాలు ఉండడంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలిసింది.
అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర సూచన
హైదరాబాద్, మే 8(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాలు ఉండడంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. గతంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో అరెస్టైన వారు, వారికి సహకరించిన వ్యక్తులను గమనిస్తుండాలని కేంద్ర నిఘా విభాగాల నుంచి రాష్ట్రాలకు సూచనలు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు పని ప్రారంభించాయి. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌తో పాటు పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, పలువురు ఉగ్రవాదులు చనిపోయిన నేపథ్యంలో అక్కడ శిక్షణ పొంది దేశంలోకి చాపకింద నీరులా వచ్చి స్లీపర్ సెల్స్‌గా జనంతో కలిసిపోయి ఉంటున్న వారిని గుర్తించడం నిఘా విభాగాల ముందున్న సవాల్.
దేశం దృష్టిని మళ్లించడానికి ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడే అవకాశాలు ఉండడంతో నిఘాను పటిష్ఠం చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు గతం లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాక్‌లోని ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్న వారిని, శిక్షణ పొంది తిరిగి వచ్చిన పలువుర్ని గతంలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించాలని ఆదేశాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బృందాలు అప్రమత్తమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News